ప్రధాన మంత్రిని కూడా వదలం… కేటిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

-

తమపై బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు తెరాస మంత్రులు ఘాటుగా సమాధానం చెప్తున్నారు. తెరాస లో చాలా వరకు సైలెంట్ గా ఉన్న మంత్రులు అందరూ ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి కేటిఆర్ బిజెపి టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేసారు. ఓపికకు హద్దులుంటాయి అని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేటిఆర్ అన్నారు. మేం తిరగబడితే ప్రధాన మంత్రిని కూడా విడిచిపెట్టం అని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

గతంలో ముఖ్యమంత్రులను ఉరికించినం అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్ ల బతుకెంత అంటూ నిలదీసిన ఆయన ఉమ్మడి ఏపీలో బిజెపి, కాంగ్రెస్ పరిస్థితి గంజిలో ఈగల కంటే అద్వాన్నం అని ఎద్దేవా చేసారు. ఉద్యమం లో కాంగ్రెస్ నేతలు పారిపోయారు అని అన్నారు. నోటి కొచ్చినట్టు కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకుంటానా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఒక్క సీటు గెలిచి బీజేపీ ఎగిరిపడుతోంది అని ఆయన ఆరోపణలు చేసారు. కులాల పేరిట బీజేపీ కుంపట్లు పెడుతుందని విమర్శలు చేసారు. ఇరవై ఏళ్లలో చాలా చూశాం అని అన్నారు. చేతులు కట్టుకుని నిలబడ్డ కాంగ్రెస్ నేతలా మా గురించి మాట్లాడేది అని ఆయన ఎద్దేవా చేసారు. కాగా కార్యకర్తల సమావేశం జరగగా అందులో పలువురు అగ్ర నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version