డబ్బులని సంపాదించేందుకు వీటిని వదులుకోవద్దు..!..!

-

డబ్బులను సంపాదించాలని ఎవరికి ఉండదు..? ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలని ఉంటుంది. దాని కోసం ఎంతగానో కష్ట పడుతూ ఉంటారు. ఆచార్య చాణక్య జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలని చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఖచ్చితంగా విజయం తథ్యం. చాణక్య ముఖ్యమైన విషయాలని చెప్పారు. డబ్బులు సంపాదించాలంటే ఈ మూడిటిని పక్కన పెట్టేయద్దు అని చాణక్య చెప్పడం జరిగింది. మరి చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం.

మతం:

డబ్బు కోసం మన మతాన్ని వదిలేయకూడదు అని చాణక్య అన్నారు. డబ్బు కోసం మతాన్ని త్యజించిన వ్యక్తి డబ్బుల కోసం చెడ్డ పనులను చేస్తూ వుంటారు. అలానే కీర్తిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మతాన్ని వదిలేయకూడదు. మతాన్ని విడిచి డబ్బు కోసం పాకులాడకూడదు.

స్వీయ గౌరవం:

ఆత్మగౌరవం అనేది మనిషి కి చాలా ముఖ్యం. ఆత్మగౌరవం ఒకసారి పోయిన తర్వాత దానిని తిరిగి పొందడం అసాధ్యం. కనుక స్వీయ గౌరవం ని పక్కన పెట్టేయద్దు. డబ్బు కోసం స్వీయ గౌరవం ని పక్కన వదిలేయడం ఏ మాత్రం కూడా మంచిది కాదని తెలుసుకోండి.

ప్రేమ:

ప్రేమ కూడా ఎంతో ముఖ్యం. డబ్బు కంటే ప్రేమే ముఖ్యం. డబ్బు కొంత కాలం మాత్రమే ఉంటుంది అని తెలుసుకోండి. ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version