మీ రాజకీయాల కోసం లంబాడాలను బలి చేయొద్దు : ఎమ్మెల్యే బాలునాయక్

-

లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంబడాలను తమ రాజకీయాల కోసం వాడుకోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గిరిజనులపై కేటీఆర్‌కు అకస్మాత్తుగా ఎక్కడ లేని ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో లంబాడీలపై జరిగిన దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

పదేళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ నాడు ఎస్టీ కమిషన్ ఎందుకు గుర్తు రాలేదని మండిపడ్డారు. కేటీఆర్ మాయమాటలను లంబాడీలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు. లగచర్ల గిరిజనులకు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తామని ఎమ్మెల్యే బాలునాయక్ వెల్లడించారు.మీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను బలిచేయొద్దని ఆయన కేటీఆర్‌కు హితవు పలికారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version