అరెస్టయిన లగచర్ల రైతులను కలవనున్న కేటీఆర్

-

అరెస్టయిన లగచర్ల రైతులను కలవనున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇవాళ అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామ రైతులను పరామర్శించనున్నారు కేటీఆర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

KTR to meet arrested Lagacharla farmers

కాగా, లగచర్ల దాడి ఘటనలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. లగచర్ల దాడి ఘటనలో మరో 10 మంది అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు. లగచర్ల దాడి ఘటనలో మరో 10 మంది అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలాగే.. రహస్యంగా విచారణ చేస్తున్నారట పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడి మరికొంత మంది కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు పోలీసులు. అదుపులో ఉన్న వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version