ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా మీరు గెలవడానికి అవుతుంది అయితే చాలా మంది ఆలోచించి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించడం వలన సమస్యల రావని గెలుపొందుతాము అనుకోవడం మంచిది కాదు. ఒక్కొక్క సారి మన ఆలోచనల వల్లే భయాలు ఆందోళనలు కలుగుతూ ఉంటాయి.
ఎక్కువ ఆలోచించడం కూడా ప్రమాదమే. ఎక్కువగా ఆలోచించడం వలన మనం ప్రశాంతతని కోల్పోతాము. ప్రతి ఒక్క గెలుపు వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టం రాకూడదని అతిగా ఆలోచించడం వలన ప్రయోజనం లేదు. ఎంత ఆలోచించినా రావాల్సిన కష్టాలు కచ్చితంగా వస్తాయి. మధ్యలో అంతరాయం కూడా కలుగొచ్చు. అంతేకానీ ఆలోచించే మంచి నిర్ణయాలు తీసుకుంటాను… అప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని అతిగా ఆలోచించడం పొరపాటు.
దీని వలన మీరు కనీస ప్రయత్నాన్ని కూడా చేయలేకపోవచ్చు. మీకు దేని మీద అయితే ఆసక్తి ఉందే దాని మీద ఫోకస్ చేయండి మీరు దేని మీద గెలవాలనుకుంటున్నారనేది చూసుకోండి. సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళండి అంతే కానీ అతిగా ఆలోచించి పని మీద ఫోకస్ పెట్టకుండా గెలవలేము. కాబట్టి చక్కగా ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకుని ఫోకస్ పెట్టి గెలుపొందండి.