శానిటైజర్లు వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్?

-

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడం కోసం ప్రజలు శానిటైజర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. అయితే మనం వాడుతున్న శానిటైజర్ ఒరిజనల్ శానిటైజరైనా…? అనే ప్రశ్నకు కచ్చితంలో ఒరిజినల్ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

తాజాగా కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీ.జీ.ఎస్.ఐ) శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో శానిటైజర్ల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీ.జీ.ఎస్.ఐ మొత్తం 122 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 5 శాంపిల్స్ లో విషపూరితమైన మిథనాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించరు. దాదాపు 45 శాంపిల్స్ లో లేబుల్స్ కు శానిటైనర్ స్పెషిఫికేషన్లకు పొంతన లేదని తేల్చారు.

అధ్యయన పరిశోధకులు 5 శాంపిల్స్ లో 4 శాతం విషపూరిత మిథనాల్ ఉన్నట్టు గుర్తించామని… మిథనాల్ మండే లక్షణాన్ని కలిగి ఉండటంతో పాటు విలక్షణమైన వాసనతో కూడిన విషపూరితమైన ద్రవం అని పేర్కొన్నారు. గ్యాస్ క్రోమాటోగ్రఫీ అనే పరీక్ష ద్వారా పరిశోధనలు చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. కొందరు తయారీదారులు లేబుళ్లలో ఇథైల్ ఆల్కహాల్ అని పేర్కొని మిథనాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ ను వాడుతున్నారని అందువల్ల శానిటైజర్ల వినియోగంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని పరిశోధనకులు చెప్పారు. మిథనాల్ ఉన్న శానిటైజర్లను వాడితే అంధత్వం బారిన పడే అవకాశం ఉండటంతో పాటు ఇర్రివర్సబుల్ ఆప్టిక్ నెర్వ్ డ్యామేజ్ కలుగుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version