ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ ముందు ఉండి నడిపించడంతో పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ పోరాటం కోసం పూర్తి స్థాయిలో సిద్దమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
లాంగ్ మార్చ్ చేసే అవకాశం ఉంద ని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనే పవన్ తో ఈ పోరాటం చేయిస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు. ఇసుక కోసం తెలుగుదేశం రెండు నెలలు పైగా పోరాటం చేస్తే ఆ క్రెడిట్ అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన లాంగ్ మార్చ్ దెబ్బకు ఆయనకే పోయింది.
తెలుగుదేశం నేతలు చివరికి ఆయనకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల తెలుగుదేశం నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజకీయంగా ఈ పోరాటం ముందు నుంచి వాళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు పవన్ తో లాంగ్ మార్చ్ చేస్తే ఆయనకు యూత్ లో క్రేజ్ ఎక్కువ కాబట్టి క్రెడిట్ అంతా ఆయనకు పోతుందని, మనమే ముందు ఉండి చేద్దామని చంద్రబాబు ముందు నేతలు వేడుకునే ప్రయత్నం చేస్తున్నారట.