క్రీడాభిమానులకు షాకిచ్చిన రెజ్లర్ వినేష్ ఫోగాట్.. మళ్ళీ ఆడతానో లేదో!

-

భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ క్రీడాభిమానులకు షాకిచ్చింది. మళ్ళీ రెజ్లింగ్ ఆడతానో లేదో అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. గాయాల కారణంగా మళ్ళీ రెజ్లింగ్ ఆడే అవకాశం లేకపోవచ్చని నిరాశను వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్ లో జరిగిన మోకాలి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డ వినేష్ ఫోగాట్, ఆ తర్వాత కోలుకున్న వినేష్ ఫోగాట్, ఆ తర్వాత కోలుకుని, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంది. క్వార్టర్స్ ఫైనల్ వరకు చేరుకున్న వినేష్, బెలారస్ కు చెందిన క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైంది.

ఆ తర్వాత ఒలింపిక్స్ లో అథ్లెట్స్ నియమాలను ఉల్లంఘించినందుకు తాత్కాలికంగా నిషేధానికి గురైంది. దాంతో నిరాశకి లోనైన వినేష్, మళ్ళీ రెజ్లింగ్ ఆడతానో లేదో అంటూ కామెంట్లు చేసి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం తనకి పెద్దగా గాయలు లేవని, మోకాలి గాయం పూర్తిగా నయమైందని, కానీ ఇప్పుడు మనసు విరిగిపోయిందని, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని వినేష్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version