ఆకాశంలో ఎగిరే విమానాలను, క్షిపణూలను గుర్తించడానికి ప్రతీ దేశానికి రాడార్ వ్యవస్థ ఉంటుంది. శత్రు దేశం మీద తమ దాడి చేస్తుందని తెలుసుకోవడానికి ఈ రాడార్లు పనిచేస్తాయి. ఐతే ఈ రాడార్లను తప్పు దోవ పట్టించే సాంకేతికత కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశం ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డీఆర్డీవో తయారు చేసిన ఈ కొత్త సాంకేతికతను ఛాఫ్ టెక్నాలజీ అని పిలుస్తున్నారు. దీని ఆధారంగా ఇతర దేశాల రాడార్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది.
రాడార్లకు దొరక్కుండా క్షిపణులను ఆకాశంలో ప్రయోగించవచ్చన్నమాట. దీని ద్వారా మన యుద్ధ విమానాలు శత్రు దేశాల క్షిపణూలకు దొరకకుండా ఉంటుంది. ఈ సాంకేతికత తయారీ చేపట్టిన డీఆర్డీవో ఛాఫ్ టెక్నాలజీ అనే పేరు పెట్టింది. దేశ రక్షణ వ్యవస్థలో నూతన సాంకేతికల కారణంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఇది సంకేతం అని చెప్పవచ్చు.