మనలో అధిక శాతం మందికి రోజూ నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. బెడ్‌పై ఉండే కాఫీ తాగి తరువాత దైనందిన కార్యక్రమాలను మొదలు పెడతారు. అయితే నిజానికి ఈ అలవాటు అంత మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం బెడ్ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తేల్చారు. ఈ మేరకు సైంటిస్టుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాత్ సైంటిస్టులు ఇటీవల కొందరిపై ప్రయోగాలు నిర్వహించారు. కొందరు స్త్రీ, పురుషులను మూడు విభాగాలుగా చేసి వారికి నిత్యం ఉదయాన్నే కాఫీ తాగమని చెప్పారు. అలా కొన్ని రోజుల పాటు చేశాక గుర్తించిందేమిటంటే.. నిత్యం ఉదయం బెడ్ కాఫీ తాగే వారిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు పెరిగినట్లు తేల్చారు. వారిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణ తప్పినట్లు గుర్తించారు. అందువల్ల ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవాలని వారు సూచిస్తున్నారు.
సాధారణంగా చాలా మంది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం వల్ల శక్తి వచ్చినట్లు ఫీలవుతారని, బడలిక నుంచి బయట పడినట్లు భావిస్తారని, అది నిజమే అయినప్పటికీ దాని వల్ల బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉండవని, దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు వారి అధ్యయన వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.