కీరా దోసకాయ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. పొరపాటే

-

కూరగాయల్లో టైం పాస్ కు తినే వాటిల్లో క్యారెట్, కీరాదోసకాయ ముందు ఉంటాయి. ఇవి హెల్త్ కూడా చాలా మేలు చేస్తాయి. అసలే వచ్చేది ఎండాకాలం.. ఈ క్రమంలో డైలో కీరాదోసకాయ తినటం వల్ల వేడి తీవ్రత నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైతం కీరాదోసకాయ బెస్ట్ ఆప్షన్. జ్యూసుల్లో వాటర్ లేకుండా కీరా వేసుకుంటే చాలు. మంచి వాటర్ కంటెంట్ ఉండటంతో ప్యూర్ జ్యూస్ వచ్చేస్తుంది. అయితే మనకు ఏది తిన్నా తర్వాత గ్లాసుడు నీళ్లు అయినా తాగడం అలవాటు. అసలు ఇది చిన్నప్పుడు నుంచి పెద్దోళ్లు మనకు నేర్పించడం వల్ల అలా వచ్చేసింది. ఈ క్రమంలోనే కీరాదోసకాయ తిని కూడా వాటర్ తాగేస్తుంటారు. అయితే ఈ పని అసలు చేయొద్దంటున్నారు నిపుణులు.

కీరా దోసకాయలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, విటమిన్లు C, Kలు పుష్కలంగా ఉంటాయి. అయితే సిలికా వంటి అవసరమైన పోషకాలు దాని తొక్కలో ఉంటాయి. దోసకాయ జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.

దోసకాయ తిన్న తర్వాత మనం నీరు తాగకపోతేనే.. ఈ పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి. లేదంటే జీర్ణక్రియ ప్రక్రియలో చాలా సమస్యలు వస్తాయి. వేసవిలో దోసకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కీరాదోసకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి. దోసకాయ కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిది..

కీరదోసకాయ ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీరా దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆహార పదార్థాలను జీర్ణం చేసే కడుపులోని యాసిడ్ సరిగా పనిచేయదు. మీరు దోసకాయ తిన్న తర్వాత నీరు తాగితే లూజ్ మోషన్, డయేరియాను వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దోసకాయ తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయికి భంగం కలుగుతుంది.

కాబట్టి..కీరా దోసకాయ తిన్నాక వాటర్ తాగే అలవాటు ఉంటే మానేయండి బాస్..

Read more RELATED
Recommended to you

Exit mobile version