హైదరాబాద్ లో పోలీస్ ఉన్న అధికారుల ఇళ్ల పై డ్రోన్ కెమెరాలు ఎగుర వేయడం కలకలం రేపింది. తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదనపు డీజీ రవి గుప్తా, ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్ల పై డ్రోన్ కెమెరాలతో విజువల్స్ చిత్రీకరించడం కలకలం సృష్టించింది. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పని చేసిన పోలీస్ అధికారులు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయా అధికారుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. డ్రోన్ కెమెరా ను ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కెమెరాను ఫోరెన్సిక్ ల్యాబ్ కు జూబ్లీహిల్స్ పోలీసులు పంపించారు. అయితే డ్రోన్ కెమెరా ఎగరడం వెనక ఎలాంటి దురుద్దేశం లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే హైదరాబాద్ అనే కాదు ఎక్కడ అయినా డ్రోన్ ఎగుర వేయాలంటే లోకల్ పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.