మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ నిఘా ఉంచారు. డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల నెట్‌వర్క్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హయత్‌నగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నైజీరియన్ వెనక లోకల్ ముఠాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.