మెగాస్టార్ మానియ తో షేక్ కాబోతున్న ఆర్ కే బీచ్ ..!!

-

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని  బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. ఇప్పుడు యంగ్ హీరోల కంటే వేగంగా సంవత్సరం లో రెండు సినిమాలు చేస్తూ అదర గొడుతున్నారు.

తాజాగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  విడుదల కు సిద్ధంగా ఉంది ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. ఈప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది.ఇప్పడు విశాఖ ఆర్ కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీనికోసం ముందస్తు గాఫ్యాన్స్ విశాఖ బీచ్‌ రోడ్‌లో ప్రమోషన్‌ ర్యాలీ నిర్వహించారు .. వాల్తేరు వీరయ్య గెటప్‌లో లుంగీ, షర్ట్‌, కళ్లద్దాలు ధరించి బీచ్‌ రోడ్‌లో హంగామా చేశారు..విశాఖ వేదికగా రేపే వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది. మెగా ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ పట్టణంలో హంగామా ఒక స్తాయిలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version