ఖమ్మం జిల్లాలోని వీఎం బంజరలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించగా.. జీవన్ కుమార్ అనే లారీ డ్రైవర్ పట్టుబడినట్లు సమాచారం. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి మద్యం సేవించి బండి నడుపుతావా? అంటూ ఖాకీలు చితకబాదినట్లు తెలుస్తోంది.
పోలీసుల దెబ్బలకు తాళలేక స్టేషన్ నుంచి పారిపోయేందుకు డ్రైవర్ ప్రయత్నించినట్లు తెలిసింది. అనంతరం డ్రైవర్ పరిస్థితి బాలేదని తెలుసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చావుబతుకుల మధ్య లారీ డ్రైవర్ కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
వీళ్లు పోలీసులా.. రాక్షసులా?
పోలీసుల దెబ్బలకు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న లారీ డ్రైవర్
ఖమ్మం జిల్లా వీఎం బంజరలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు
జీవన్ కుమార్ అనే లారీ డ్రైవర్ పట్టుబడగా.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
మద్యం సేవించి బండి నడుపుతావా? అంటూ దారుణంగా… pic.twitter.com/vyM5WSvgNd
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 2, 2025