బ్రేకింగ్‌ : తెలంగాణలో భారీగా ఎత్తున డీఎస్పీల బదిలీ

-

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 15 మంది డీఎస్పీల బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పరిధికి వస్తే కాచిగూడ ఏసీపీ గా ఆకుల శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ గా సుదర్శన్, సంగారెడ్డి డీఎస్పీ గా బాలాజీ, ఎల్బీనగర్ డీఎస్పీ గా శ్రీధర్ రెడ్డి, పఠాన్ చెరువు డీఎస్పీ గా భీం రెడ్డి బదిలీ అయ్యారు.

పంజాగుట్ట ఏసీపీ గా గణేష్, సిద్ధిపేట ఏసీపీ గా రామేశ్వర్, శంషాబాద్ ఏసీపీ గా భాస్కర్, బాన్సువాడ డీఎస్పీ గా జైపాల్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ గా కె.శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఇక మిగిలిన వారి వివారలు తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల ముంగిట ఈ బదిలీలు సర్వ సాధారణం అని అంటున్నారు. ఇక ఈ అంశం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version