బీఆర్ఎస్ పార్టీకి మరోషాక్ తగలనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గమైన దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.
దుబ్బాక ఎమ్మెల్యే వినతిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.యూనివర్సిటీ కోసం కావాల్సిన స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంఓకు ఆదేశాలు కూడా జారీ చేశారని టాక్. దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హబ్సీపూర్- లచ్చపేట్‌కు రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు సైతం మంజూరు చేసినట్లు తెలిసింది. దీంతో దుబ్బాక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.