తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన సినిమా “సీతారామం”.. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. దుల్కర్ సల్మాన్ రామ్‌గా.. బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ సీతగా నేషనల్ క్రష్ రష్మిక మంధన్న కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సింపుల్ గా చెప్పాలంటే.. టాలీవుడ్ కు ప్రాణం పోసింది ఈ దుల్కర్ సినిమా.
సీతారామంతో మంచి విజయాన్ని అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. గతంలో మహానటి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఇక ఇప్పుడు సీతా రామంతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు దుల్కర్. ఈ నేపథ్యంలో.. శేఖర్ కమ్ములతో ఓ సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. దుల్కర్ కోసం శేఖర్ కమ్ముల ఓ కథను సిద్ధం చేశాడని.. దానికి దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్‌గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని టాక్ వినిపిస్తోంది.