కరోనా తీవ్రత పశ్చిమ బెంగాల్ లో తగ్గింది. కాని వస్తుంది శీతాకాలం కావడంతో కరోనా ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు బెంగాల్ ప్రజలకు ఒక సమస్య వచ్చి పడింది. త్వరలో దసరా ఉన్న నేపధ్యంలో… భారీ దుర్గా పూజ జరుగుతుంది. కోల్‌కతాలో 2 వేలకు పైగా పండళ్లు ఉన్నాయి, పూజ తొమ్మిది రోజుల్లో మొత్తం రాష్ట్రంలో పండళ్ళ సంఖ్య 30,000 కి చేరుకుంటుంది.
భారీగా ప్రజలు హాజరు అవుతారు. వారిని కట్టడి చేయడం కూడా అసాధ్యం. సామాజిక దూరం పాటించడం అనేది ఒక కల. జనాలు ఇప్పటికే నియంత్రణలో లేరు. మాస్క్ లు కూడా ధరించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆస్పత్రుల సంఖ్యను పెంచుతున్నారు.