డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. బాధిత తండ్రి బిక్షపతి కథనం ప్రకారం.. నవాబుపేట్ మండల్ మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి భార్య స్వప్న దంపతులకు ఈనెల 4న సిజేరియన్ ద్వారా బాబు జన్మించాడు.పుట్టినప్పుడు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు.
అయితే, సోమవారం తెల్లవారుజామున బాబుకు ఎక్కిళ్లు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి తీసుకురాగా డ్యూటీ డాక్టర్ సమయానికి అందుబాటులో లేడు. ఆయన్నుపిలువగా రాలేదు. స్టాఫ్ నర్సుల ద్వారా డాక్టర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపలేదని, డాక్టర్ సమయానికి వచ్చి ఉంటే తమ బాబు బతికేవాడని బాధితుడు బిక్షపతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.తన బాబు మరణానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితు కుటుంబం ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.