ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడుని 25 ఏళ్ల నుంచే ఢీ కొంటున్నానని, ఎప్పుడో అచ్చెన్నాయుడు తాట తీశానని అన్నారు. నా జీవితాన్ని అచ్చెన్నాయుడు రోడ్డుకీడ్చారని ఆయన అన్నారు. జగన్ నా ఇంటి దైవం.. నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరేస్తామని అన్నారు. దున్నపోతు మీద నా దూకుడు ఆగదు.. రెట్టింపు దూకుడుతోనే వెళ్తానని అన్నారు.
అచ్చెన్నాయుడుకు సరైన వాడు తగలకపోవడంతో నాయకుల్లా ఎదిగారని, ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ప్రజా ద్రోహులని అన్నారు. రామ్మోహన్నాయుడు ఒక్కసారైనా గ్రామాల్లో పర్యటించారా ? అని దువ్వాడ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు చరిత్రను బయట పెడతానన్న ఆయన అచ్చెన్నాయుడిదేం చరిత్ర.. దిక్కుమాలిన చరిత్ర అని అన్నారు. నా మీద చేసిన ఆరోపణలపై అమరావతిలో బహిరంగ చర్చ పెడతానని దున్నపోతులాంటి అచ్చెన్నాయుడుకు ఓ కుర్చీ వేస్తా.. ఆయన చర్చకు రాగలరా..? అని ప్రశ్నించారు.