ఆమె అరిస్తే.. మెరుపులే.. కేకలేస్తూ రూ. కోట్లు సంపాదిస్తున్న యువతి..!

-

హర్రర్‌ మూవీస్‌లో మనకు బాగా భయం కల్పించేవి.. బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చే వాయిస్‌లే. కావాలంటే మీరు మ్యూట్‌ చేసి ఎంత సీరియస్‌ హర్రర్‌ మూవీ అయినా చూడండి అస్సలు కొంచెం కూడా భయమేయదు. బ్యాక్ గ్రౌండ్‌ నుంచి వచ్చే విపరీతమైన ఏడుపులు, కేకలు ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయి. మీరెప్పుడైనా అసలు ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో సౌండ్స్‌ ఎలా వస్తాయో ఆలోచించారా..! వాటికోసం సినిమా వాళ్లు ఏం చేస్తారో తెలుసా..! డైలాగ్స్‌ కోసం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ను పెట్టుకున్నట్లే.. ఇలా అరిచేందుకు కూడా పెట్టుకుంటారు.. ఓ యువతి ఇలా అరుస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఆష్లే పెల్డన్‌. వృత్తిరీత్యా స్క్రీమ్‌ ఆర్టిస్ట్‌ అయిన ఆమె.. హాలీవుడ్‌లో పలు హారర్‌ సినిమాలకు, టీవీ సిరీస్‌లకు తన గళాన్ని అరువిస్తోంది. ఇలా తన అరుదైన నైపుణ్యాల్ని చాటుకోవడమే కాదు.. మంచి పేరుప్రఖ్యాతులతో పాటు బోలెడంత డబ్బూ సంపాదిస్తోంది.

అరవడం అంటే అంత ఈజీ కాదు.. అందులో చాలా భావోద్వేగాలు ఉంటాయి. భయంతో, బాధతో, కోపంతో ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాలా అరవాలి. తన వృత్తిని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుందట ఈమె. న్యూయార్క్‌కు చెందిన ఆష్లే పెల్డన్‌ సహజంగా వచ్చిన ఈ ట్యాలెంట్‌తో అటు పేరు, ఇటు డబ్బూ సంపాదించచ్చని నిరూపిస్తోందీ.

ఆష్లే చిన్నప్పటి నుంచే అల్లరిపిడుగు.. ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వాళ్లపై విరుచుకుపడేది. అరిచి ఆగం ఆగం చేసేది. అయితే ఇదే ట్యాలెంట్‌ పెద్దయ్యాక ఆమెను సెలబ్రిటీగా మార్చుతుందని తన ఎప్పుడూ అనుకోలేదట. తాను ఏడేళ్ల వయసున్నప్పుడు అనుకోకుండా ‘ఛైల్డ్‌ ఆఫ్‌ యాంగర్‌’ అనే సినిమా అవకాశం వచ్చింది. హింసకు గురైన ఓ ఆరేళ్ల అమ్మాయి కథ అది. అందులో పాత్ర అనుభవించే వేదన, భావోద్వేగాలకు తగినట్లుగా అరుపులు, కేకల్ని తన గళంలో వినిపించి పాత్రకు ఆష్లే ప్రాణం పోసింది.

అలా ఆమె ట్యాలెంట్‌ బయటపడడంతో అవకాశాలూ క్యూకట్టాయి. 20 ఏళ్ల వయసొచ్చే వరకు ‘ఫ్రీ గయ్‌’, ‘పారానార్మల్‌ యాక్టివిటీ’, ‘స్క్రీమ్‌’.. వంటి సుమారు 40 కి పైగా సినిమాలకు, మరెన్నో టీవీ షోలకు స్క్రీమింగ్‌ ఆర్టిస్ట్‌గా చేసింది.. తన గొంతుతో కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆష్లే.. ఇప్పుడు సినిమాల్లో స్క్రీమింగ్‌ ఆర్టిస్ట్‌గానే కాదు.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, వీడియో గేమ్స్‌, రేడియో స్పాట్స్, ఆడియోబుక్స్‌.. వంటి వాటిలోనూ తన గళాన్ని వినిపిస్తోంది..

ఆష్లే సైకాలజీలో పీహెచ్‌డీ చేసింది.. అందుకే ఎలాంటి భావోద్వేగానికైనా సులభంగా కనెక్ట్‌ అవుతుందట..సీన్‌కి తగినట్లుగా తక్కువ స్వరంతో ఎమోషన్స్‌ పండిస్తుంది.. అదే దెయ్యం పాత్రకు తగినట్లుగా ప్రేక్షకుల్లో భయం రెట్టింపు చేయడానికి మరింత గట్టిగా అరుస్తుంది. ఒక్కోసారి రోజుకు 8-10 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుందట. అయినా అందులో శ్రమ తెలియదు. పని ఇష్టంతో చేస్తే కష్టమనిపించదంటారు కదా..! 2010లో స్టీవ్‌ హర్డిల్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది.!

మనలో ఉన్న ఏ టాలెంట్‌ వృథా కాదు.. కాకపోతే.. దానికి సరైన ఫ్లాట్‌ ఫ్లామ్‌ వెతుక్కోవడమే మన వంతు. ఆష్లే తన టాలెంట్‌తో కోట్లల్లో డబ్బు సంపాదిస్తోంది. మీలో ఉన్న స్పెషల్‌ టాలెంట్‌ ఏంటో మీరు గుర్తించారా..!

 

-Triveni Buskarowthu

https://twitter.com/ashleypeldon?lang=en

Read more RELATED
Recommended to you

Exit mobile version