భారత దేశంతో వరస భూకంపాలు గుబులుపుట్టిస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఏదో చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న హిమాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవిస్తే తాజాగా బుధవారం ఉదయం అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్ చేసింది. అండమాన్ లోని దిగ్లపూర్ కు సమీపంలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దిగ్లిపూర్ కు 90 కిలోమీటర్ల ఆగ్నేయంగా భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది.
అండమాన్ నికోబార్ లో భూకంపం.. ఇండియాలో వరసగా భూప్రకంపనలు
-