హర్యానాలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. హర్యానాలోని ఝజ్జర్‌లో బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఝజ్జర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది.
భూకంపం వల్ల జరిగిన ఆస్థి, ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈనెల 15న మేఘాలయలో 3.9 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలోపే అసోంలో కూడా భూ కంపం వచ్చిందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3.22 గంటలకు భూమిలో కదలికలు సంభవించాయని ఎన్‌సీఎస్ తెలిపింది.