మ‌ళ్లీ కిర‌ణ్ కుమార్ రెడ్డా ? ఎందుకు రా బాబూ !

-

కాంగ్రెస్ పార్టీలో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్నారా ? ఈ డౌట్ తోనే ఇవాళ ప్ర‌యాణం చేయాలి. కాంగ్రెస్ లో ఆయ‌న ఉన్నా లేకున్నా ఆయ‌న స్థానం మాత్రం రాహుల్ గుండెలో ఉంది. ఇంకా మిగ‌తా కాంగ్రెస్ అభిమానుల్లో కూడా ఉంది. ఏదో కోపం వ‌చ్చి ఆయ‌న స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టి న‌ష్ట‌పోయినా ఇప్ప‌టికీ ఆయ‌న కాంగ్రెస్-కు వీర‌విధేయుడే ! త‌న మిత్రుడే క‌దా పీసీసీ చీఫ్ బాధ్య‌త‌ల్లో ఉన్న‌ది క‌నుక ఆయ‌న స్థానంలో ఏపీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి బాధ్య‌త‌లు అందుకునే రోజు రానే వ‌చ్చింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి ప్రత్యేక కాలంలో ముఖ్య‌మంత్రిగా ఉంటూ, ఉర్దూ మీడియం చ‌దువుకున్న విద్యార్థిగా ఆ ఉచ్ఛార‌ణ‌తో తెలుగు ప‌లికి, తెలుగు నేల‌ను ఏలిన న‌ల్లారి మ‌ళ్లీ తెర‌పైకి రానున్నారు అన్న‌ది ఓ ప్రాథ‌మిక స‌మాచారం.

వాస్త‌వానికి ఓ ఊహాజ‌నిత ప్ర‌తిపాద‌న ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖాయం అయ్యే విధంగానే ఉంది. ఎందుకంటే బీజేపీ నాయ‌క‌త్వం కుటుంబ పాల‌న‌తో ఉన్న ప్రాంతీయ పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టేది లేదని తేల్చేసింది. దాంతో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా కూడా బీజేపీ తో స్నేహం అంత సులువూ కాదు సాధ్యమూ కాదు. అందుకే పాత విధానాల్లో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ క‌లిసేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు ఆప్ కూడా ఇటుగా వ‌స్తుంది. ఒక‌వేళ సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ క‌నుక ఆప్ ప‌గ్గాలు అందుకుంటే మాత్రం జ‌న‌సేన,ఆప్ క‌లిసి జ‌గ‌న్ సేన‌పై పోరాటం చేయొచ్చు. అందుకు అవ‌కాశాలు కూడా ఉన్నాయి.ఆ విధంగా కాకుండా జేడీ వేరు కుంప‌టి పెడితే మాత్రం టీడీపీ కూడా జేడీతో క‌లిసి వెళ్లే యోచ‌న చేయ‌వ‌చ్చు. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు. ఇదే నయా రాజ‌కీయం కావొచ్చు.

ఇక మ‌ళ్లీ కిర‌ణ్ కుమార్ రెడ్డి ద‌గ్గ‌ర‌కే వ‌ద్దాం. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాలు చూసిన అనుభవం ఉన్నా అప్ప‌టికీ ఇప్ప‌టికీ బోలెడు మార్పులు వ‌చ్చేశాయి. జిల్లాల‌లో కొద్దో గొప్పో కార్య‌వ‌ర్గాలున్నా కూడా అవేవీ యాక్టివ్ మోడ్-లో లేవు. పార్టీకి సంబంధించి కొన్ని డీసీసీ కార్యాల‌యాలు దిష్టి బొమ్మ‌ల్లా మిగిలిపోయాయి అన్న ఆవేద‌న కూడా ఫ‌క్తు కాంగ్రెస్ అభిమానుల్లో ఉన్నా వారేం చేయ‌లేని విధంగా ప్ర‌స్తుత ప‌రిణామాలు నెల‌కొని ఉన్నాయి. ఈ ద‌శ‌లో త‌న స్నేహితుడు వైఎస్సార్ కుమారుడు జ‌గ‌న్ తో పోరు జ‌ర‌ప‌డం సాధ్య‌మా అన్న‌దే ఇప్పుడొక పెద్ద ప్ర‌శ్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version