సింపుల్ గా డబ్బు సంపాదించాలనుకుని… అనుకోకుండా చిక్కారు..

-

డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది ఇదే. అయితే ఈ రోజుల్లో కష్టపడి డబ్బు సంపాదించే అంత ఓపిక ఎవరికీ ఉండటం లేదు. అక్రమ మార్గాలవైపు చూస్తున్నారు చాలా మంది. హైదరాబాద్ లోనూ అలా ప్రయత్నించిన కొందరు యువకులు పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లికి చెందిన హిమాన్ సింగ్ క్రేన్ వ్యాపారం చేస్తుంటాడు. అతను బాగా డబ్బున్నవాడని స్థానిక యువకులు కనిపెట్టారు. ఆయన్ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనుకున్నారు. అద్దెకు క్రేన్ కావాలంటూ ఫోన్ చేశారు. జిన్నారం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడిన ఓ పరిశ్రమను తొలగించాల్సి ఉందంటూ నమ్మబలికారు.

పాపం.. వారి మాటలు నమ్మిన హిమాన్సీ సింగ్ పరిశ్రమను చూసేందుకు వారి వెంట బయలుదేరాడు. అతడిని ఓకారులో ఎక్కించుకుని నర్సాపూర్ మండలం కొండాపూర్ వైపు వెళ్లారు. అయితే అనుకోకుండా వారికి దూరంగా ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని కనిపించింది. దాంతో కంగారు పడిపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని దూరంగా అక్కడే నిలిపేశారు. హిమాన్స సింగ్ ను వాహనంలోనే కొట్టి.. బొమ్మ పిస్తోలు, కత్తితో బెదిరించారు. ఫోన్, ఆయన జేబులోని డబ్బు, ఫోన్ లాక్కుని కిందకు తోసేసి కారుతో పరారీ అయ్యారు.

హిమాన్స్ సింగ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితులంతా గాజులరామారంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఇలా చేశామని వారు ఒప్పుకున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశామని చెప్పారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version