టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి ఈటల రాజేందర్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈటల…టీఆర్ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు..ఆ పార్టీకి చెందిన బలమైన నేతలపై వల వేస్తున్నారు. అలాగే తనకు కావల్సిన నేతల చేత టీఆర్ఎస్ పార్టీలో అలజడి రేపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలని కోవర్టులుగా మార్చారని టాక్ నడుస్తోంది.
ఇదే క్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్…ఈటల సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈయన టీఆర్ఎస్ తరుపున రెబల్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేయగా, ఈయనకు ఈటల మద్ధతు తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ టీఆర్ఎస్ లోనే పనిచేస్తున్నారు. తాను కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పి…టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్‌లోనే ఉంటూ..ఆ పార్టీకే నష్టం జరిగేలా రవీందర్ పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలే..రవీందర్ పై ఫైర్ అవుతున్నారు. కోవర్టుగా పనిచేస్తూ…మంత్రి గంగుల కమలాకర్ ఓటమి కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాజాగా కరీంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు..టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్‌కు ఫిర్యాదు చేశారు. ఓ వైపు కేసీఆర్ పై నమ్మకంగానే ఉంటూనే…మరోవైపు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులలపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే వారు గంగుల కమలాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు రవీందర్ సింగ్ 350 ఫిర్యాదులు చేసి అభివృద్ధి పనులు అడ్డుకున్నారని టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇక ఇటీవల రవీందర్ సింగ్ కుమార్తె, అల్లుడు కూడా మంత్రికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని, తాజాగా రవీందర్ అల్లుడు సోహాన్ సింగ్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ కూడా సంచలనంగా మారింది. దీంతో సింగ్ కుటుంబాన్ని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రవీందర్..ఈటల చెప్పినట్లే చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ లో రవీందర్ సింగ్ సంచలనం రేపుతున్నారు.