పార్లమెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల సంఘం ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపుతున్నా ఈ సందేశాలని వెంటనే నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా వికసిత భారత్ పేరిట వాట్సాప్ లో సందేశాలని పంపుతోంది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసి చెప్పింది పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేయడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపిస్తున్న ఈ సందేశాలని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.