రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది.బీఆర్‌కే భవన్‌లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రైల్వేతో పాటు పెట్రోలియం సంస్థల్లో ఓటరు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా నిఘా వ్యవస్థను విస్తృతం చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపుతో పాటు నిల్వల సైతం నిఘాను పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.