దిల్లీ లిక్కర్​ స్కామ్​పై ఈడీ విచారణ.. దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు

-

దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఈడీ దర్యాప్తు షురూ చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ సహా దేశంలోని 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీతో పాటు ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించాయి.

అయితే, ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో దాడులు చేయడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. దిల్లీ, గురుగ్రామ్, లఖ్​నవూ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు నగరాల్లో సోదాలు చేపట్టినట్లు వివరించాయి. మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, జోర్​బాగ్​లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి కోటి రూపాయలను ట్రాన్స్​ఫర్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version