ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడి దూకుడు పెంచింది. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ దాడులు చేయగా.. హైదరాబాదులో ఆరు ప్రదేశాల్లో సోదాలు చేసింది. సిబిఐ కేసులో ఏ -14 అరుణ్ రామచంద్ర పిళ్ళై నివాసం లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ తారుణంలోనే ఈడీ చేతికి కీలక ఆధారాలు చిక్కాయి. రామచంద్ర పిళ్ళై తో తెలంగాణా రాజకీయ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని.. వారితో ఉన్న వ్యాపార లావాదేవీలను ఆరా తీసే పనిలో ఈడీ ఉంది.
ఈడీ సోదాలతో తెరపైకి ఎడికోర్ కంపనీ…వచ్చింది. సూదిని సృజన్‌రెడ్డి, కల్వకుంట్ల కవితలు డైరెక్టర్‌లుగా 2010లో ఏర్పాటైన ఎడికోర్.. ఎడికోర్ కంపనీకి చెందిన పలు డాక్యుమెంట్లను సోదాల్లో గుర్తించింది ఈడీ. దీంతో ఎడికోర్ లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ.. రామచంద్ర పిళ్ళై తో ఆర్ధిక లావాదేవీలు జరిపిన వారి వివరాలు కూపి లాగుతున్నారు.
కేసీఆర్ బర్త్‌డే సంబర్భంగా కవిత కుటుంబంతో పిళ్ళై తిరుమల వెళ్లి పూజలు చేసినట్లు గుర్తించింది ఈడీ. ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై బిజెపి నేతల తీవ్ర ఆరోపణలు చేశారు. బిజెపి నేతల ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..ఇప్పుడు రామచంద్ర పిళ్ళై తో ఉన్న కవిత ఫోటో బయటకు రావడంతో రాజకీయ కలకలం రేగుతోంది.