మనీలాండరింగ్ కేసులో మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కె.మేఘచంద్ర సింగ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ఈడీ చర్యలను విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసినందుకే మేఘచంద్రపై ‘రాజకీయ ప్రతీకారం’ తీర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, అమిత్ షా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్‌సింగ్‌లకు వ్యతిరేకంగా గళం విప్పినందుకే మేఘచంద్రను మౌనంగా ఉంచేందుకే సమన్లు జారీ చేశారన్నారు.
కాగా, కె.మేఘచంద్రకు అక్టోబరు 3న ఈడీ సమన్లు పంపింది. దర్యాప్తునకు సంబంధించిన ఆధారాలు,రికార్డులు సమర్పించేందుకు సోమవారం ఢిల్లీలోని ఈడీ ఆషీసులో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, మేఘచంద్ర ఈడీ ఎదుట హాజరుకాలేదు.తనకు సోమవారమే సమన్లు అందాయని..అందువల్లే ఈడీ ఆఫీసులో హాజరుకాలేదని తెలిపారు. తనను ఈడీ ఎందుకు పిలిచిందో అర్థం కావడం లేదని..తాను ఎమ్మెల్యే లేదా మంత్రిని కాదని చురకలు అంటించారు.