నేడే ఎడ్ సెట్ ఫలితాలు..ఇలా చెక్ చేసుకోండి..!

-

డిగ్రీ పూర్తి చేసి టీచర్ గా కెరీర్ ను ప్రారంభించాలి అనుకునేవారు బీఈడీ ప్రవేశం కోసం ఎడ్ సెట్ పరీక్ష రాశారు. అయితే ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఇక ఈ ఏడాది మొత్తం 34,186 మంది ఎడ్ సెట్ పరీక్ష రాశారు.

కాగా మొత్తం కన్వీనర్ కోటాలో 13 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇక ఎడ్ సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం…https://edcet.tsche.ac.in/ అనే వెబ్ సైట్ ను సందర్శించండి. ఇక ఎడ్ సెట్ లో సీటు సంపాదిస్తే ఆ తరవాత టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) రాసి టీచర్ వృత్తి లో కొనసాగవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version