అభ్యర్ధులని ప్రకటించేశారు..ఇంకా ఎన్నికల బరిలో దిగి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే బిఆర్‌ఎస్ పార్టీ లక్ష్యం..ఇప్పుడు ఆ దిశగానే సిఎం కేసిఆర్..బిఆర్‌ఎస్ అభ్యర్ధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 119 స్థానాలకు 115 మంది అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు. రేపో మాపో 4 స్థానాలకు కూడా అభ్యర్ధులని కేటాయిస్తారు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల బరిలో దిగడమే తరువాయి. ప్రత్యర్ధులపై పొరాడి ఓడించాలి.
ఇక్కడ వరకు అంతా క్లారిటీ గానే ఉంది..కానీ అసలు ముందు ఒక లక్ష్యాన్ని బిఆర్‌ఎస్ అభ్యర్ధులు దాటాలి అది ఏంటంటే..సొంత పార్టీలో వ్యతిరేకతని అధిగిమించాలి. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. అలాగే కొన్ని చోట్ల పలువురు సీనియర్లు సీటు కోసం పోటీ పడ్డారు. కానీ ఇవేమీ కేసిఆర్ లెక్కలోకి తీసుకోలేదు. కేవలం 9 సిట్టింగ్ సీట్లలోనే మపృలు చేశారు. మిగిలిన స్థానాల్లో యథావిధిగా సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిల నుంచి గెలిచిన బిఆర్‌ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు. ఆ స్థానాల్లో ఉన్న బిఆర్‌ఎస్ నేతలకు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మిగిలిన వారు ఏం చేస్తారనేది ప్రశ్న. పార్టీలోనే ఉంటూ పోటీ చేసే వారికి యాంటీగా పనిచేస్తే పార్టీకే ఇబ్బంది. కేవలం ఆ స్థానాలు మాత్రమే కాదు..ఇంకా పలు చోట్ల ఎమ్మెల్యేలకు బిఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు.
ముందు పోటీ చేసే బిఆర్‌ఎస్ అభ్యర్ధులు ఆ వ్యతిరేకతని తొలగించుకోవాలి. తాజాగా తాండూరులో కాంగ్రెస్ నుంచి వచ్చిన రోహిత్ రెడ్డికి సీటు ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి కూల్ చేస్తున్నారు. అటు రోహిత్ సైతం..పట్నం కాళ్ళు మొక్కీ ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అక్కడ వివాదం సద్దుమణిగింది. రోహిత్ మాదిరిగానే సొంత పార్టీలో యాంటీ ఉన్న అభ్యర్ధులు..తమ నేతలని మచ్చిక చేసుకోవాలి. అప్పుడే ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టగలరు. లేదంటే అంతే సంగతులు.