ఎడిట్ నోట్: బాబు x పెద్దిరెడ్డి..గెలిచేదెవరు?

-

నలభై ఏళ్ల నాటి రాజకీయ వైరం…ఇప్పటికీ అదే స్థాయిలో రాజకీయ శతృత్వం నడుస్తోంది. ఒకరినొకరు ఓడించుకోవాలనే కసి ఎవరికి తగ్గలేదు. అందుకే సవాళ్ళు విసురుకోవడంలో ఎవరు తగ్గడం లేదు. ఎవరికి వారు ఓడిస్తానని సవాల్ చేసుకుంటున్నారు. అలా సవాళ్ళు చేసుకుంటున్న నేతలు ఎవరో కాదు..టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఇద్దరు నేతల సొంత చిత్తూరు. వీరికి కాలేజీ రోజుల నుంచి వైరం ఉంది.

1978లో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి గెలిస్తే..పెద్దిరెడ్డి జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1983లో చంద్రబాబు ఓడిపోగా, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓడిపోయారు. అయితే 1985లో బాబు టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే..ఆ తర్వాత 1989 నుంచి కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు.  1989లో పీలేరులో పెద్దిరెడ్డి గెలిచారు. 1994లో ఓడిపోగా, 1999 ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2009 నుంచి పుంగనూరు నుంచి సత్తా చాటుతున్నారు.

అయితే ఇద్దరు నేతలు సీనియర్లే. పైగా రాజకీయ వైరం ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో బాబుకు చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు. గత ఎన్నికల్లో సక్సెస్ కూడా అయ్యారు. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లకు 13 వైసీపీ గెలుచుకుంది. కుప్పంలోనే టీడీపీ గెలిచింది. ఇప్పుడు కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడించాలని పెద్దిరెడ్డి ఏ తరహా రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అధికార బలం వాడుతూ..అక్కడ బాబుని ఓడించాలని చూస్తున్నారు.

దీంతో బాబు కూడా రివర్స్ అయ్యారు..ఓ వైపు కుప్పంని సరిచేసుకుంటూనే..పెద్దిరెడ్డి అడ్డా పుంగనూరుపై ఫోకస్ పెట్టారు. తాజాగా కుప్పంలో పర్యటించిన బాబు..పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించి తీరతామని సవాల్ చేశారు. అలాగే దమ్ముంటే తనని కుప్పంలో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బాబు సవాల్ చేశారు. అటు పెద్దిరెడ్డి సైతం కుప్పంలో ఓడిస్తామని, దమ్ముంటే తనని పుంగనూరులో ఓడించాలని ఛాలెంజ్ చేశారు. ఇలా ఇరువురు నేతలు సవాళ్ళు చేసుకున్నారు.

మరి ఈ సవాళ్లలో ఎవరు గెలుస్తారంటే..ఇప్పుడే చెప్పడం కష్టం..ఎన్నికల సమయంలోనే ఎవరి గెలుపు ఏంటో తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులు చూస్తే..కుప్పంలో బాబుని ఓడించడం అంత ఈజీ కాదు..అదేవిధంగా పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించడం కూడా సులువు కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version