ఎడిట్ నోట్: కౌంటర్ ‘పాలిటిక్స్’..!

-

తెలంగాణలో కౌంటర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్ట్ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బి‌జే‌పి ప్రయత్నిస్తుంది..దానికి కౌంటరుగా కేంద్రంలో బి‌జే‌పిని నిలువరించాలని కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది.

రెండు పార్టీలు అధికార బలాన్ని వాడుకుని..ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్లు లీకేజ్ అంశం సైతం కే‌సి‌ఆర్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇలా కే‌సి‌ఆర్ సర్కారుని బి‌జే‌పి ఇరుకున పెట్టేందుకు చూస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరపైకి తీసుకొచ్చి బి‌జే‌పిని ఇరుకున పెట్టడానికి కే‌సి‌ఆర్ సర్కారు ప్రయత్నించింది. ఇక తాజాగా పేపర్ లీకేజ్ అంశంలో సైతం రివర్స్ కౌంటర్ ఇచ్చింది.

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ల లీక్ తర్వాత టెన్త్ పేపర్లు లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కుట్ర దాగి ఉందని…బి‌జే‌పి నేతలు హస్తం ఉందని, కొందరు టీచర్ల ద్వారా పేపర్లు లీక్ చేయించి కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి బి‌జే‌పి ప్రయత్నించిందని చెబుతూ..ఇందులో బండి సంజయ్ కుట్ర ఉందని, ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పేపర్ల లీకులో బి‌జే‌పికి బి‌ఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది.

బండికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్‌కు మోదీ రానున్నారు. ఇక మోదీ పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం కే‌సి‌ఆర్ హాజరు కావాలి..ఆయన హాజరు కావడం లేదు. అదే సమయంలో సింగరేణి కార్మికుల చేత నిరసనలు తెలియజేసేలా ప్లాన్ చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మోదీ రాకపై నిరసనలు తెలియజేయనున్నారు. మరి బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పి ఎలా కౌంటర్ ప్లాన్ చేస్తుందో చూడాలి. మొత్తానికి ఇలా కౌంటర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version