మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఆయన తన 29వ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే ఈ సినిమాపై ఇప్పటినుంచి అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి. అందులోను మహేష్ బాబు కావడంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయని చెప్పాలి. అయితే ఈసారి రాజమౌళి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్ కూడా ముహూర్తం ఖరారు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథతో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలి అని కూడా రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇప్పటికే బిజినెస్ కోసం హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని.. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా రంగంలోకి దింపబోతున్నారని సమాచారం. మరొకవైపు ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో షూటింగ్ విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది. ఇక వచ్చే సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాజమౌళి కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా త్రివిక్రమ్తో సినిమా పూర్తి చేసి మహేష్ బాబు ఈ సినిమాలో నటించడానికి సిద్ధం కాబోతున్నారు. సెప్టెంబర్ లో త్రివిక్రమ్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాడు.. మహేష్ వెంటనే గ్యాప్ లేకుండా రాజమౌళి సినిమా మొదలుపెట్టబోతున్నారట. మొత్తానికైతే ఏడాది చివరి కళ్ళ మహేష్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది.