ఎడిట్ నోట్: జగనే బ్రాండ్..!

-

గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు పెద్దగా గడపగడపకు వెళ్ళి ప్రజల సమస్యలని పట్టించుకునే వారు కాదు. ఏదో ఎన్నికల సమయంలోనే గడపకు వెళ్ళేవారు. అప్పుడు ప్రజల నుంచి నిరసనలు వచ్చేవి. దీని వల్ల ఎన్నికల్లో మైనస్ అయ్యేది. అందుకే దానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఇంకా రెండేళ్లు పైబడి ఉండగానే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు చెప్పడం, పథకాల అందేవారికి ఎంతవరకు ఎంత లబ్ది జరిగిందో ఎమ్మెల్యేలు వివరించే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేలు గడపగడప వెళ్లినప్పుడు మొదట్లో నిరసనలు వచ్చాయి. కొన్ని అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. కానీ తర్వాత అభివృద్ధి కూడా జరుగుతుండటంతో నిరసనలు తగ్గాయి. ఎమ్మెల్యేల గడపగడపకు వెళితే మంచి స్పందన వస్తుంది. కాకపోతే కొందరు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి..అలాంటి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు. సరిగా పనిచేయకపోతే సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు.

ఇప్పటికే అలా పలుమార్లు ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. తాజాగా కూడా గడపగడపకు ప్రోగ్రాం పెట్టిన జగన్..18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు తిరగడం లేదని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని జగన్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ వరకు సమయం ఇస్తున్నానని ఈ లోపు పనితీరు మెరుగు పర్చుకోకపోతే నెక్స్ట్ సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆధారపడి వైసీపీ విజయం వస్తుందని చెప్పలేం.

పనితీరు బాగోకపోయిన గెలిచే ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే..పథకాలు క్రెడిట్ మొత్తం జగన్‌దే..ఎమ్మెల్యేల పాత్ర పెద్దగా లేదు. కాబట్టి ఏదైనా జగన్‌కే వస్తుంది. జగన్ బొమ్మ వల్లే మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవాలి. ఆయనే ఒక బ్రాండ్ కాబట్టి..ఆయన బొమ్మతో గెలవాలి. ప్రజలు సైతం జగన్ ని చూసే వైసీపీకే ఓటు వేయనున్నారు. కాబట్టి ఎమ్మెల్యేల్లో కొంతమంది పనితీరు బాగోకపోయినా జగన్ అనే బ్రాండ్ మాత్రమే వైసీపీని గెలిపించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version