ఏపీలో మరో హృదయ విదారక దృశ్యం వెలుగుచూసింది. తండ్రి ఆత్మహత్య చేసుకుంటానని ఏడుస్తూ చెప్పడంతో కన్నకూతురు వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓ రైతు తనకున్న 70 సెంట్ల భూమిని మ్యూటేషన్ చేయించాలని రెవెన్యూ ఆఫీసుకు వెళ్లగా.. సదరు రైతు దగ్గర వీఆర్వో రూ.3 లక్షలు అడిగారని రైతు ఆవేదన చెందాడు.
పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు సదరు రైతు విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ.. వేలకు వేలకు జీతం తీసుకుంటూ..లంచాలు అడుగుతున్నారని వీఆర్వోతో వాగ్వాదానికి దిగాడు.తాను చనిపోతానని తండ్రి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తండ్రిని ఆపేందుకు ప్రయత్నిస్తూ కూతురు రోదిస్తున్న విజువల్స్ అందరినీ కలిచివేస్తున్నాయి.నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ ఘటన జరగగా.. లంచం అడిగిన వీఆర్వో మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కన్నీరు పెట్టించే ఘటన.. తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నారని నాన్న కోసం వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు
గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ.. వేలకు వేలకు జీతం తీసుకుంటూ.. 70 సెంట్ల భూమిని మ్యూటేషన్ కోసం రైతు దగ్గర రూ. 3 లక్షలు వీఆర్వో అడిగారని రైతు ఆవేదన.
ఇలాంటి వారిని సస్పెండ్ చేస్తే మళ్లీ… pic.twitter.com/tULx1oSOlS
— greatandhra (@greatandhranews) February 22, 2025