ఎడిట్ నోట్: చివరి ఛాన్స్..!

-

వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అటు జగన్‌కు గాని, ఇటు చంద్రబాబుకు గాని చాలా ముఖ్యమని చెప్పొచ్చు. జగన్ గాని మరోసారి అధికారంలోకి రాకపోతే..వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో, బాగా కసి మీద ఉన్న టీడీపీ ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేడు. ఇక బాబు గాని మళ్ళీ సీఎం అవ్వకపోతే..ఇంకా ఆయన రాజకీయ చరిత్ర క్లోజ్ అయినట్లే..టీడీపీ పార్టీని వైసీపీ ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే టీడీపీని దెబ్బమీద దెబ్బకొట్టింది. ఇంకోసారి అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్తితి అంతే.

అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపుని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయి. ఇటు జగన్ ఏమో ఈ సారి అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉండవచ్చని వైసీపీ నేతలకు చెబుతున్నారు..175 స్థానాలు ఎందుకు గెలవలేమని అంటున్నారు. మన పథకాలు కంటిన్యూ అవ్వాలంటే..మళ్ళీ మనమే అధికారంలోకి రావాలని చెబుతున్నారు.

అటు చంద్రబాబు వర్షన్ వేరుగా ఉంది..టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్న పథకాలని కట్ చేయమని, ఇంతకంటే మెరుగ్గా పథకాలు అందిస్తామని, జగన్ మాదిరిగా అప్పులు చేసి పథకాలు ఇవ్వమని, ఆదాయం సృష్టించి ఇస్తానని అంటున్నారు. తాజాగా కర్నూలు పర్యటనలో బాబు..ఎన్నికల హామీలు ఇచ్చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల ప్రచారం మాదిరిగా రాజకీయం మొదలుపెట్టారు.

ఉద్యోగాలు సృష్టిస్తామని, కంపెనీలు తీసుకొస్తామని, ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని చెబుతున్నారు. ఇక తనని అనేక రకాలుగా అవమానించారని, తన భార్యని అవమానించారని, అందుకే అసెంబ్లీ నుంచి వచ్చేశానని, ప్రజాక్షేత్రంలో గెలిశాక అసెంబ్లీలో అడుగు పెడతానని, ఇక తనని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని, ఇవే తనకు చివరి ఎన్నికలని, ఇప్పుడు గాని గెలిపించుకోలేకపోతే..మళ్ళీ రాజకీయాల్లో కనిపించననే విధంగా బాబు ప్రచారం చేస్తున్నారు.

అంటే తనకు ఇవే చివరి ఎన్నికలు అని, ఇప్పుడు గెలిపిస్తే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగిస్తానని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రజలు కూడా జగన్ పాలనన కూడా చూద్దామని అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నారు. ఇక బాబు పాలన ప్రజలకు తెలుసు..కానీ ఇప్పుడు చివరి ఛాన్స్ అంటున్నారు..ఇప్పుడు గెలిపించుకోలేకపోతే మళ్ళీ కనబడనని జగన్ మాదిరిగా సెంటిమెంట్ అస్త్రం వదులుతున్నారు. మరి ప్రజలు బాబుకు చివరి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version