ఎడిట్ నోట్: విపక్ష ‘ఐక్యత’..కాంగ్రెస్‌తో కేసీఆర్.!

-

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. కేంద్రంలో  మోదీని గద్దె దించే దిశగా విపక్షాలు కలవడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకాలం సఖ్యత లేకుండా విపక్షాలు ఎవరికి వారే ఉన్నట్లే ఉన్నాయి. కానీ విపక్షాలని లక్ష్యంగా చేసుకుని వాటిని అణిచివేయడమే పనిగా పెట్టుకుని బి‌జే‌పి ముందుకెళుతుంది. ఈ క్రమంలో పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో చెప్పాల్సిన పని లేదు.

అయితే కాంగ్రెస్ బలాన్ని తగ్గించే విధంగా బి‌జే‌పి పావులు కదుపుతుంది. ఇక రాహుల్ గాంధీని సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. అటు ఆప్, ఇటు బి‌ఆర్‌ఎస్…ఇంకా కీలక పార్టీల నేతలపై కేసులు ఎలా వచ్చి పడుతున్నాయో తెలిసిందే. ఇదే క్రమంలో బి‌ఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్..దేశ స్థాయిలో బి‌జే‌పిపై పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విపక్షాలని ఏకం చేయాలని చూస్తున్నారు. కాకపోతే తెలంగాణలో కే‌సి‌ఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది..దీంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నారు.

కానీ మోదీని గద్దె దించాలంటే విపక్షలకు కాంగ్రెస్ మద్ధతు తప్పనిసరి..అందుకే ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. తాజాగా  బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని కాంగ్రెస్‌, జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ అగ్రనేతలు సంకల్పం తీసుకున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌, జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ ఢిల్లీలో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

ఇక వీరు మిగిలిన విపక్షాలని ఏకతాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఇక డీఎంకే, ఎన్సీపీతో కాంగ్రెస్‌ నేతలు చర్చించాలని.. టీఎంసీ, ఆప్‌, బీఆర్‌ఎస్‌ తదితరపార్టీల అధినేతలతో నితీశ్‌ కుమార్‌ చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద విపక్ష నేతలందరితో సమావేశమై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించాలని నిర్ణయించారు. అటు మిగిలిన విపక్షాలు సైతం కలిసేలా ఉన్నాయి. ఇదే క్రమంలో కే‌సి‌ఆర్ సైతం..కాంగ్రెస్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ విపక్షాల ఐక్యత ఎంతవరకు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version