సెప్టెంబర్ నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు రీ ఓపెన్ !

-

విద్యా సంస్థల ఓపెన్ చేయడం పై తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి మరియు విద్యా శాఖ అధికారు లతో సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ లో తెలంగాణ లో విద్యాసంస్థలు రీ ఓపెన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని పై సీఎం కెసిఆర్ చర్చించ నున్నారు.

అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలల్లో ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. విద్యా సంస్థలు తెరవచ్చని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు తాజా పరిస్థితు లపై విద్యా శాఖ సీఎం కెసిఆర్ కు నివేదిక అందించింది. వీటన్నిటిని దృష్టి లో ఉంచుకుని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకొనున్నారు. దీనిపై మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version