FLASH : ఈషా రెబ్బాకి షాక్ ఇచ్చిన హ్యాకర్లు.. ఏకంగా..?

-

టాలీవుడ్‌ బ్యూటీ ఈషా రెబ్బా ట్విట్టర్ అకౌంట్‌ను కొందరు హ్యాకర్స్ హ్యాక్ చేశారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాలో వెల్లడించింది. ”నా ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్‌ లేదు అని చూపిస్తోంది” అని ఈషా ఇన్‌స్టాలో వెల్లడించింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిత్యం తన అభిమానులకు అందుబాటులో ఉంటూ.. తన ఫోటోలను వారితో పంచుకునే ఈషా.. ఇప్పుడు అకౌంట్ హ్యక్ అవ్వడంతో సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసిందట.

కాగా, ఇక సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది కొత్తేమి కాదు. గతంలో చాలా మంది సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.. తాజాగా సింగర్ స్మిత అకౌంట్‌ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. అలాగే ప్రస్తుతం ఈషా టెక్నికల్ టీమ్‌ దీన్ని పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈషా లస్ట్ స్టోరీస్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version