కేరళలో దారుణం చోటు చేసుకుంది. నాకంటూ ఎవరు లేరని చెప్పడంతో హత్యకు గురయ్యాడు రిటైర్డ్ ఉద్యోగి పపాచ్చన్. కేరళ రాష్టం కోల్లంలో ఓ బ్యాంకులో తోంబైలక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసాడు 80 ఏళ్ళ రిటైర్డ్ ఉద్యోగి పపాచ్చన్. అయితే ఫిక్సిడ్ వేసే క్రమంలో తమకంటూ ఎవరు లేరని.. ఒంటరి అని బ్యాంక్ మేనేజర్ సరితకు చెప్పాడు. దాంతో మొదటి రోజు వృద్ధుడు FD అకౌంట్ నుండి 40 లక్షలు విత్ డ్రా చేసింది బ్యాంకు మేనెజర్. అయితే ఆ నలబై లక్షలు ఎందుకు డ్రా అయ్యాయని బ్యాంకులో ప్రశ్నించడంతో వృద్దుడి హత్యకు ప్లాన్ చేసారు.
ఒంటరితనం తో ఉన్న వృద్దుడి దగ్గరగా తోంబైలక్షల డబ్బులు కోట్టేయడానికి తమ కారుతో గుద్ది చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించింది మహిళ బ్యాంక్ మేనేజర్ సరిత. తను ఒంటరిగా ఉండటంతో చంపినా ఎవరు రారు అనుకుని హత్యచేసి నట్లు పోలిసుల విచారణలో వెల్లడించింది నింధితురాలు. అయితే ఈ కేసులు సరితో పాటుగా ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.