అమల్లోకి ఎన్నికల కోడ్.. మంచిర్యాలలో తొలగించని హోర్డింగులు

-

తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఈనెలాఖరులోగా ఈ ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్లెక్సీ హోర్డింగులను మాత్రం ఇంకా తొలగించలేదు.

దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 5 రోజులు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ హోర్డింగులు అధికారులు తొలగించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తాలో, చున్నంబట్టి వాడలో కాంగ్రెస్ పార్టీ హోర్డింగులు తాజాగా దర్శనమిచ్చాయి.ఎన్నికల కోడ్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదా అంటూ అధికారులపై స్థానికులు మండి పడుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version