మరో రెండు నెలలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, అధికారిక వైసిపి పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇరు పార్టీ నాయకులు బహిరంగ సభలలో మాత్రమే కాకుండా ట్విట్టర్ వేదికగా కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ పై వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు.