మహారాష్ట్ర, హర్యానాల‌తో పాటు హుజూర్‌నగర్‌లో కొన‌సాగుతున్న పోలింగ్..

-

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, బరిలో 3,237 మంది ఉన్నారు. వీరిలో 235 మంది మహిళా అభ్యర్థులు. ఇక హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1169 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 104 మంది మాత్రమే మహిళలు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 స్థానాలు, మహారాష్ట్రలోని సతారా, బీహార్‌లోని సమస్తీపూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

హుజూర్‌నగర్‌లోనూ పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 302 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇక ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 24న ఫలితాలు వెలువడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version