విద్యుత్తు చ‌ట్టం దుర్మార్గమైన‌ది – సీఎం కేసీఆర్

-

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌స్తుతం తీసుకు వ‌స్తున్న విద్యుత్తు చ‌ట్టం దుర్మార్గ మైన‌ది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విద్యుత్తు చ‌ట్టాన్ని త‌మ పార్టీ తీవ్రం గా వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ ల్లో ను ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల విష‌యం లో చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు.

ఈ విద్యుత్తు చ‌ట్టం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం రైతుల మెడ మీద క‌త్తి పెట్టి వ్య‌వ‌సాయ బావుల వ‌ద్ద మీట‌ర్లు బిగిస్తుంద‌ని తెలిపారు. అంతే కాకుండా రైతుల నుంచి అధిక మొత్తం లో క‌రెంటు ఛార్జీల ను వ‌సూల్ చేస్తుంద‌ని తెలిపారు. దీని వ‌ల్ల తెలంగాణ రైతులు తీవ్రం గా న‌ష్ట పోతార‌ని అన్నారు. అలాగే ఈ చ‌ట్టం ద్వారా త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే 24 గంట ఉచిత క‌రెంటు కూడా ప్ర‌మాదం లో ప‌డుతుంద‌ని అన్నారు. ఈ చ‌ట్టానికి తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version