క్యాంటిన్ లోకి వెళ్ళిన ఏనుగు… చివరకు… వీడియో వైరల్…!

-

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మధ్య ఏనుగులు భీభ‌త్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. జనావాసాల్లోకి వచ్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వరుస ఘటనల దెబ్బకు ప్రజలు భయపడిపోతున్నారు. గత నెలలో అయితే ఒక ఏనుగు ఒకే రాత్రి అయిదుగురిని చంపినా ఘటన అసోం లో చోటు చేసుకుంది ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు దానిని బంధించే వరకు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత ఏడాది కాలంగా ఈశాన్య భారతంలో ఏనుగుల కారణంగా 211 మంది మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ఇక తాజాగా మరో ఏనుగు భీభ‌త్సం సృష్టించించింది. పశ్చిమ బెంగాల్ లో ఒక కిచెన్ లోకి నడుచుకుంటూ వచ్చి అక్కడి జనాలను తీవ్రంగా భయపెట్టింది ఏనుగు. బెంగాల్ లోని డూయర్స్ లోని హసీమారా ఆర్మీ క్యాంటీన్ లో ఖాళీ భోజనశాలలోకి ప్రవేశించి, టేబుల్స్ మరియు కుర్చీలను పడేస్తూ… హడావుడి చేసింది. దీనిని గమనించిన అక్కడ ఉన్న స్థానికులు భయపడి దాక్కున్నారు. అక్కడ ఉన్న వారు ఎంత బెదిరించినా సరే… ఆ ఏనుగు మాత్రం వెనక్కి తగ్గలేదు… ఇంకా లోపలికి రావడంతో దాన్ని అక్కడి నుంచి తరిమేందుకు గానూ..

ఒక అట్ట ముక్కకు నిప్పు ఎలిగించి బెదించారు… అయినా సరే ఆ ఏనుగు మాత్రం భయపడలేదు. దీనితో చేసేది లేక ఒక కర్రకు నిప్పు వెలిగించి దాన్ని బెదిరించడంతో ఆ ఏనుగు వెనక్కి తగ్గింది. దాన్ని బయటకు తరిమే వరకు ఆ నిప్పుతో వెంబడించారు. అయితే బయటకు వెళ్ళిన తర్వాత అది ఎదురు తిరిగినా ఏ మాత్రం భయపడకుండా… అలాగే దాన్ని బెదిరించడంతో ఏనుగు అక్కడి నుంచి జారుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఈ ప్రాంతం భూటాన్ హసీమార నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version