మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన, తన తల్లితండ్రుల మరియు తాతయ్య పర్యవేక్షణలో పెరగడంతో పాటు మంచి బిజినెస్ ఉమన్ గా పేరు తెచ్చుకున్నారు. అలానే ఫిట్ నెస్ మరియు వ్యక్తిగతంగా ఆడవారు ఎలా ఉండాలి అనే దాని పై ఉపాసన కొన్ని మోటివేటెడ్ స్పీచెస్ కూడా తరచూ ఇస్తూ ఉంటారు. కొన్నాళ్ల క్రితం తన పేరుతో యూట్యూబ్ లో ఒక ఛానల్ స్టార్ట్ చేసిన ఉపాసన, ఫిట్ నెస్ మరియు పలు మోటివేషనల్ వీడియోస్ ని తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో ఎంతోమంది ప్రజలు డెంగ్యూ మహమ్మారి బారిన పడుతుండడంతో, వాటి నుండి మనల్ని మనం రక్షించుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయమై ఆమె ఒక వీడియో చేసి తన ఛానల్ లో పోస్ట్ చేసారు. అలానే ఆ వీడియోల ద్వారా ఆమెకు మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఇకపోతే నిన్న జరిగిన షాద్ నగర్ దుర్ఘటనపై ఎంతో చెలించిపోయిన ఉపాసన,
నేడు ఒక షాకింగ్ వీడియోని తన ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. నేటి సమాజంలోని మన పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు మృగాళ్ల బారినపడకుండా, అలానే అత్యాచారాలకు గురికాకుండా ఉండడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలానే వాటితో పాటు కొన్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ టిప్స్ ని కూడా అందిస్తూ ఉపాసన పోస్ట్ చేసిన ఆ వీడియోపై పలువురు నెటిజన్లతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంతో ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఈ విధంగా తనవంతుగా ప్రజలను చైతన్యవంతులను చేసేలా ఉపాసన చేస్తున్న వీడియోలకు అందరి నుండి ప్రశంసలు కురుస్తున్నాయి……!!